Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Janhvi Kapoor | బాలీవుడ్ అందాల తార, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. సినిమాల్లోకి రావడానికి ముందు తన తల్లి శ్రీదేవి పెట్టిన కండిషన్లు, ఆమె ఇచ్చిన సలహాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Janhvi Kapoor | బాలీవుడ్ అందాల తార, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. సినిమాల్లోకి రావడానికి ముందు తన తల్లి శ్రీదేవి పెట్టిన కండిషన్లు, ఆమె ఇచ్చిన సలహాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. తొలుత తాను సినిమాల్లోకి వస్తానంటే తల్లి శ్రీదేవి పెద్దగా ఆసక్తి చూపించలేదని, అయితే ఆ తర్వాత తన నిర్ణయానికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి ఎప్పటికప్పుడు పలు సందర్భాల్లో మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన కెరీర్‌కు సంబంధించి తల్లి ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని మొదట శ్రీదేవికి చెప్పానని, అయితే ఆమె వెంటనే అంగీకరించలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే సాధారణ విషయం కాదని, ఈ రంగంలోకి వస్తే జీవితాంతం నటనకే అంకితం కావాల్సి ఉంటుందని తన తల్లి చెప్పినట్లు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందని శ్రీదేవి తనకు వివరించినట్లు చెప్పారు. మొదట్లో తనపై తల్లికి అంతగా నమ్మకం ఉండేది కాదని కూడా జాన్వీ పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పిన మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లోకి రావడానికి ముందు తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన తల్లి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆ తర్వాతే తనలో నటిగా కొనసాగగల లక్షణాలు ఉన్నాయని శ్రీదేవి భావించినట్లు చెప్పుకొచ్చారు. అయితే జాన్వీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అందం, సినీ రంగ ప్రవేశానికి ముందు చేసిన మార్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు తన వ్యక్తిగత రూపం, అందం గురించి జాన్వీ బహిరంగంగా మాట్లాడారు. అందం విషయంలో ఇతరులతో పోల్చుకోవడం సరికాదని, సోషల్ మీడియాలో కనిపించే అందమైన చిత్రాలను చూసి యువతులు తమను తాము తక్కువగా భావించుకోవద్దని సూచించారు.తన వ్యక్తిత్వం, అందం, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాల్లో తల్లి ప్రభావం ఉందని జాన్వీ గతంలోనూ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

