డాక్టర్! నా వయస్సు 57 సంవత్సరాలు. ఈ మధ్య అంగస్తంభన సమస్య మొదలైంది. గతంలో గుండెకు స్టంట్ వేశారు. నేను వయాగ్రా వాడవచ్చా? మా బావగారు బీపీ ఉన్నా మెడికల్ షాప్‌లో కొనుక్కుని వాడతారు. నన్నూ వాడమంటున్నారు. పోనీ, సెక్స్ హార్మోన్స్ ఇంజెక్షన్ వాడొచ్చా?
– డి. పురుషోత్తం, ఆదిలాబాద్
మీ బావగారు డాక్టరు కాదు. పైగా బీపీ పెట్టుకొని, డాక్టరు పర్యవేక్షణ లేకుండా వయాగ్రా లాంటి ప్రమాదకర మందుని వాడుతూ.. మిమ్మల్నీ వాడమని తప్పుడు సలహా ఇస్తున్నారు. ముందు ఆయన్ని వయాగ్రా మానెయ్యమని చెప్పండి. బీపీ, గుండె, కిడ్నీ జబ్బులున్న వారు వయాగ్రా వాడకూడదు. అయితే, టెస్టోస్టీరాన్ రక్తంలో తగ్గితే కచ్చితంగా అంగస్తంభనలు తగ్గుతాయి. వయసు 50 దాటాక టెస్టోస్టీరాన్ హార్మోను స్థాయి తగ్గుతూ ఉంటుంది. సెక్స్‌పై కోరికలుంటే టెస్టోస్టీరాన్‌ను ఆండ్రాలజిస్టు పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. అలాగే, అంగస్తంభన సమస్యకు డయాబెటిస్, బీపీ, లివరు, కిడ్నీ, ప్రోస్టేటు లాంటి కారణాలేమైనా ఉండొచ్చు. వాటి గురించి కూడా పరీక్షలు చేయించాలి. మీకెలాగూ గుండె జబ్బువల్లే ఈ సమస్య వచ్చింది. కాబట్టి, మీరు వయాగ్రా అసలు వాడకండి. దానివల్ల హఠాత్తుగా గుండెపోటు రావచ్చు. మీ భార్యతో సహా సెక్సాలజిస్టును కలవండి. మారిటల్ థెరపీలో కొన్ని సూచనలతో గుండెపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సెక్స్‌లో పాల్గొనవచ్చు.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?