ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా?
నాకు ఈ మధ్యే పెండ్లయింది. అయితే, నా భార్య వక్షోజాలు వదులుగా ఉన్నాయి. పెండ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్‌గా ఉంటాయంటారు కదా! ఆమెకు పెండ్లికి ముందు వేరే సంబంధాలు ఉన్నాయంటారా?
మేడమ్! నా వయసు 28 ఏండ్లు. బి.ఎడ్ చేశాను. నాకు ఈ మధ్యే పెండ్లయింది. అయితే, నా భార్య వక్షోజాలు వదులుగా ఉన్నాయి. పెండ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్‌గా ఉంటాయంటారు కదా! అది నిజమేనా? వయసును బట్టి వక్షోజాలు ఉంటాయంటారా? ఆమెకు పెండ్లికి ముందు వేరే సంబంధాలు ఉన్నాయంటారా? నా అనుమానం నివృత్తి చేయగలరు?- ఓ సోదరుడు

నువ్వు బి.ఎడ్ చేశానని చెబుతున్నావు. కానీ, నీ అనుమానాలు చదువుతుంటే… నీకు విద్యా జ్ఞానం, స్త్రీలను గౌరవించే సంస్కారం కొంతైనా లేవనిపిస్తున్నది. కనీస పరిజ్ఞానం లేకుండా నువ్వు క్షోభ పడుతూ, నీ భార్యనూ అనుమానిస్తున్నావు. వక్షోజాల్లో కండరాలు ఉండవు. కొవ్వు కణాలు, గ్రంథులు, పాలను చనుమొనల ద్వారా తీసుకెళ్లే నాళాలు (మిల్క్ డక్ట్స్) ఉంటాయి. అవన్నీ మెత్తని అనుసంధాన కణజాలంతో బంధించబడి, దగ్గరగా ఉంటాయి.
అలాగని వక్షోజాలు బిగించి ఉండాలని ఏమీ లేదు. వ్యక్తికీ, వ్యక్తికీ ఈ వక్షోజాల అంతర్గత అమరికలో తేడా ఉంటుంది. వివాహానికి ముందు స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటే వక్షోజాలు సాగినట్లు అవుతాయన్నది మూర్ఖమైన అపోహ మాత్రమే! అయితే, తల్లయ్యాక బిడ్డకు పాలిచ్చే సమయంలో అంటే గర్భధారణ, పిల్లలు పుట్టిన తర్వాత వక్షోజాల బిగువులో మార్పు వస్తుంది.
ఈ సమయంలో అంతర్గత కణజాలం మెత్తబడుతుంది. పరిమాణమూ మారుతుంది. అంటే కొద్దిగా పెద్దగా అవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొలాక్టివ్ అనే హార్మోన్ల స్థాయిలో పెండ్లికి ముందు, తర్వాత దశల్లో చాలా తేడాలు ఉంటాయి. ఈ హార్మోన్లు వక్షోజాల పరిమాణంలో మార్పునకు దోహదం చేయడంతోపాటు చనుమొలలు పగలకుండా కాపాడుతాయి.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సమస్యలొస్తాయా?
లావైపోయాను.. కాపురానికి పనికిరానా?
ఎంత పనిచేసినా అలసట రావొద్దంటే వీటిని తినండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

