చాలామంది కొంతసేపు పనిచేసినా అలసిపోతుంటారు.. కొద్ది అడుగులు వేయగానే చెమటలు కక్కుతుంటారు. అయితే, ఇలాంటి సమస్యకు ఉలవలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల గురించి సిటీవాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. పల్లెటూర్లలో ఉండేవాళ్లకి ఉలవల ప్రాధాన్యత బాగా తెలుసు. అయితే, అవి పశువుల దాణాకు మాత్రమే పనికొస్తాయని భావిస్తారు. కానీ ఉలవలు తింటే మనుషులకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉలవలను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.