తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు

మేడం! నా పెండ్లయి ఆరు నెలలైంది. నా భర్త ప్రవర్తన వింతగా ఉంది. పెండ్లి చూపుల్లో నచ్చిన తర్వాతే వివాహం చేసుకున్నాడు. కానీ, తర్వాత దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నాడు. ఎందుకలా? అంటే ‘ముందు నీ ఫేస్ మీద జిడ్డు, మొటిమలు తగ్గించుకో! నెల రోజుల్లో సైట్ తగ్గించుకో!’ అంటూ నా కండ్లద్దాలు తీసి పాడేశాడు. కండ్లజోడు లేకుండా కంప్యూటర్‌పై పని చేసుకోవడం ఇబ్బందిగా ఉందన్నా వినడం లేదు. పైగా ‘మిగతా ఆడపిల్లల్లా యాక్టివ్‌గా ఉండు, స్పీడ్‌గా మాట్లాడు. నీ కన్నా నీ చెల్లెలే అందంగా ఉంది. నువ్వెందుకు అలా లేవు. నిన్ను చూస్తుంటే మూడ్ రావడం లేదు’ అంటూ మాటలతో మనసును గాయం చేస్తున్నాడు. తను ముట్టుకోడు, నన్ను ముట్టుకోనివ్వడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడంలేదు. నన్నేం చేయమంటారు?
l ఓ సోదరి, కూకట్పల్లి
నీ భర్త చెబుతున్న కారణాలేవీ సరైనవి కావు. నీతో దాంపత్య జీవితాన్ని తప్పించుకోవడానికి పనికిరాని సాకులన్నీ చెబుతున్నాడు. మీ ముఖం మీద మొటిమలు పెండ్లికి ముందు కూడా ఉన్నాయి కదా! కండ్లజోడూ అంతేగా!! పోనీ అతనేమైనా మన్మథుడా అంటే? కాదు కదా! నీ రూపాన్ని హేళన చేస్తూ, నిన్ను అవమానించడం, అందులోనూ నీ చెల్లితో పోల్చడం, కండ్లద్దాలు తీసేయడం ఇవన్నీ అమానవీయం, కుసంస్కారం. ఇలా భార్యను హింసించడం నేరం. అసలు విషయం అతను నీతో దాంపత్య జీవితాన్ని దాటవేస్తున్నాడు. దీని వెనకాల అతనిలో శారీరకంగా సెక్స్ సమస్య ఉండటమో, సెక్స్ గురించి మానసిక ఆందోళనలు కారణం కావచ్చు. నీ ముందు ఆ లోపాన్ని కప్పిపుచ్చడానికి ఇదంతా చేస్తున్నట్లుంది. రెండువైపులా పెద్దవాళ్లను కూర్చోబెట్టి అన్ని విషయాలూ మాట్లాడండి. అతనికి మూడ్ రాకపోవడానికి నీ ముఖం మీద మొటిమలు, నీ కండ్లద్దాలు కావని.. అతనిలోని సెక్స్ లోపమేనని కచ్చితంగా చెప్పు. నిన్ను.. నీ చెల్లితో పోల్చి అవమానిస్తే చూస్తూ ఊరుకోనని కరాఖండిగా చెప్పు. సెక్సాలజిస్ట్‌ను సంప్రదించి, తనలో ఏమైనా లోపాలుంటే వాటిని తగ్గించుకుంటేనే కాపురం చేస్తానని మీ ఆయనకు చెప్పెయ్. వైద్య పరీక్షల్లో ఏం తేలుతుందో.. దాన్ని బట్టి మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవచ్చు. నిజంగానే అతనిలో తీవ్రమైన, చికిత్సకు కూడా తగ్గని సెక్స్ సమస్య ఉంటే విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకో. ఈ సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్,
రైస్ హాస్పిటల్, హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

