లావైపోయాను.. కాపురానికి పనికిరానా?
నా వయసు యాభై అయిదు. కొద్దిగా లావయ్యాను.ఆకర్షణ కోల్పోయాను. మెనోపాజ్ దశలో ఉన్నాను. అలా అని, నేను సెక్స్ జీవితానికి పనికి రానా? మా వారు తరచూ నాతో ఇలాంటి మాటలే అంటుంటారు.
మేడం నమస్తే. నా వయసు యాభై అయిదు. కొద్దిగా లావయ్యాను.ఆకర్షణ కోల్పోయాను. మెనోపాజ్ దశలో ఉన్నాను. అలా అని, నేను సెక్స్ జీవితానికి పనికి రానా? మా వారు తరచూ నాతో ఇలాంటి మాటలే అంటుంటారు. ఆయనకి 63 ఏండ్లు. బట్ట తల. పెద్ద పొట్ట. తనలో సెక్స్ బలహీనతలను పెట్టుకొని నన్ను సతాయిస్తున్నారు. ఈ వేధింపులు చిరాగ్గా అనిపిస్తున్నాయి. నన్నేం చేయమంటారు?
– లీల, హైద్రాబాద్

లీల గారూ! మీకు యాభై అయిదు. మీ వారికి అరవై మూడు. ఆయన మేల్ మెనోపాజ్‌కి చేరుకోలేదా? ఇంకా యవ్వనంలోనే ఉన్నారా? బట్టతల, బాన పోట్ట, సెక్స్‌లో బలహీనత ఆయనకూ వచ్చాయని గుర్తు చేయండి. యవ్వనకాలమంతా మీతో గడిపిన ఆనందకర దాంపత్య జీవితానికి విలువే లేదా?…తనలో లోపాలు పెట్టుకొని మిమ్మల్ని వేధించడం లౌక్యం కాకపోతే మరెమిటి? వయాగ్రా వేసుకుంటే తప్ప దాంపత్యం నెరపలేని ఆ పెద్ద మనిషి కొద్దిపాటి లావు మినహా మరే లోపమూ లేని మిమ్మల్ని వేధించడం ఏమిటి? స్త్రీ పురుషులు మెనోపాజ్/ఆండ్రోపాజ్ దశలకు చేరుకున్నాక.. ఇద్దరికీ హార్మోన్ల లోపాలకు సంబంధించిన శారీరక ,మానసిక సమస్యలు ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వల్ల యోని నాళం పొడిబారిపోతుంది.
కలయికలో మంట, నొప్పి కారణంగా సెక్స్ పట్ల భయం, విముఖత వెంటాడుతాయి. హర్మోన్ల లోపం ఫలితంగా డిప్రెషన్‌కు, మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. భార్య మాత్రమే ముసలిది అయిపోయిందనీ, తానింకా యవ్వనంలోనే ఉన్నానన్న భ్రమల్లో బతికే భర్తల వల్ల ఇంకా చిరాకు పెరిగిపోతుంది. మీ భర్త మారాల్సిందే. మీ చికిత్స విషయానికి వస్తే.. పొడిబారిన యోనిలోకి ఈస్ట్రోజెన్ హార్మోన్ క్రీమ్ వాడాలి. ఈస్ట్రోజెన్ హార్మోన్స్ లభించే సోయా బీన్స్ లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర తగ్గించాలి. దానివల్ల కొవ్వు పేరుకు పోదు.. రోజూ వాకింగ్, యోగా చేస్తూ ఉంటే..ఉత్సాహంగా ఉంటారు. డిప్రెషన్‌ను తగ్గించే హెల్దీ హార్మోన్లు విడుదల అవుతాయి. క్రమేపీ లైంగిక జీవితం కూడా మెరుగు అవుతుంది.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్,
రైస్ హాస్పిటల్, హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

