ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
మా వారికి ‘ స్కిజోఫ్రీనియా ’. రోజూ సెక్స్ కావాలని వేధిస్తారు. తట్టుకోలేనంత బాధ, విరక్తి కలుగుతున్నాయి. ఈ మానసిక వ్యాధి ఉన్నవారిలో సెక్స్ కోరిక మరీ అంత ఎక్కువగా ఉంటుందా? మీరే దారి చూపాలి.
మా వారికి ‘ స్కిజోఫ్రీనియా ’. రోజూ సెక్స్ కావాలని వేధిస్తారు. తట్టుకోలేనంత బాధ, విరక్తి కలుగుతున్నాయి. ఈ మానసిక వ్యాధి ఉన్నవారిలో సెక్స్ కోరిక మరీ అంత ఎక్కువగా ఉంటుందా? మీరే దారి చూపాలి. – ఓ సోదరి

మేనియా లాంటి విపరీత మానసిక అపసవ్యతా లక్షణం ఉన్న రోగుల్లో తీవ్ర లైంగికవాంఛను గమనించవచ్చు. ‘ స్కిజోఫ్రీనియా ’ లాంటి మానసిక వ్యాధులు చుట్టుముట్టినప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి మానసిక అవరోధాలూ ఉండవు. కానీ, అలాంటి వారిలో లైంగిక విశృంఖలత్వానికి ఇదొక ప్రధాన కారణం. వీరి మెదడులోని అన్ని స్ఫియర్స్లో చురుకుదనం హెచ్చుతుంది. అలాగే, కొన్ని శారీరక కారణాలూ వుంటాయి.
ఉదాహరణకు మెదడు ముందు భాగమైన ఫ్రాంటల్లో కణితులు ఏర్పడటం లేదా తలకు దెబ్బ తగిలిన తర్వాతి దశల్లో, ఫిట్స్ తదుపరి దశల్లో.. రోగుల్లో లైంగికవాంఛ పెరుగడం గమనించవచ్చు. అలాగే, శృంగార హార్మోన్స్‌లో విపరీతమైన అసమతుల్యత కూడా ఈ స్థితికి కారణమవుతుంది. మీ వారిని మరోసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఆండ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. వారు డోసు మార్చి కోరికల్ని తగ్గించే హార్మోన్లు ఇస్తారు.
అంతేకాకుండా, దంపతులిద్దరూ సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, సెక్సువల్ కౌన్సెలింగ్ ద్వారాకూడా మీ సమస్య పరిష్కారమవుతుంది. మీరు వెంటనే ఆ పని చేయండి. సెక్స్‌కు కొన్నాళ్లు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పుట్టింటికి వెళ్తూ ఉండటం కూడా మంచిదే. మీకు శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం కదా!
ఆ పెండ్లి ఇష్టం లేదు!
నాకు పదిహేనేండ్లు. పదో తరగతి చదువుతున్నా. ఇంకా పై చదువులు చదువాలని ఆశ. కానీ, మా ఇంట్లోవాళ్లు నాకన్నా 12 ఏండ్లు పెద్దయిన మా బావతో పెండ్లి చేస్తామంటున్నారు. నాకు ఇష్టం లేదు. నా మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంట్లోనుంచి పారిపోవాలని ఉంది. అమ్మగురించే ఆలోచిస్తున్నాను. మీరే సలహా ఇవ్వండి? – ఓ సోదరి
మానసికంగా, శారీరకంగా ఎదగని వయసులో పెండ్లి చేయడం చాలా తప్పు. బాల్య వివాహం చట్టరీత్యా నేరం కూడా. ముందు మీ స్కూల్ టీచర్లతో మీ తల్లిదండ్రులకు చెప్పించే ప్రయత్నం చెయ్యి. ఒప్పుకోక పోతే బాలల హక్కుల సంఘం ప్రతినిధులను నేరుగా కలువు. వారు మీ ఇంటికొచ్చి పెండ్లి ప్రయత్నాలను ఆపుతారు. మీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు.
బాల్య వివాహం విద్యాపరమైన హక్కులను కాలరాయడమే కాకుండా బలవంతపు లైంగిక జీవితం, హింస, టీనేజ్‌లో గర్భధారణ, అబార్షన్లు, చిన్న వయసులో తల్లి కావడం, బాల కార్మికులుగా మారడం.. వంటి విపరిణామాలకు దారితీస్తుంది. నీకు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే హక్కు ఉంది. అధైర్య పడకుండా ఈ పద్ధతిని పాటించు. అయినా మీ తల్లిదండ్రులు పెండ్లి ప్రయత్నాలు మానకుంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
లావైపోయాను.. కాపురానికి పనికిరానా?
టాయ్ లెట్ దుర్వాసనకు కారణాలు..
ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా ?ఇలా చేస్తే చిటికెలో ఆగిపోతాయి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

