ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా ?ఇలా చేస్తే చిటికెలో ఆగిపోతాయి
ఎక్కిళ్లు ( Hiccups ) దాదాపుగా అందరికీ కామన్‌గా వచ్చే సమస్యే. సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు.
ఎక్కిళ్లు ( Hiccups ) దాదాపుగా అందరికీ కామన్‌గా వచ్చే సమస్యే. సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు. తరచూ ఈ సమస్య వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు తగ్గినా ఈ సమస్య అలాగే ఉంటుది. అలాంటి వారి ఇబ్బందిని అర్థం చేసుకున్న టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక డివైజ్‌ను రూపొందించారు. ఈ పరికరం సాయంతో ఎక్కిళ్లను తగ్గించవచ్చని వారు చెబుతున్నారు.

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి
ఫ్రెనిక్, వేగస్ నాడులు బిగుసుకు పోవడం వల్ల ఊపిరితిత్తుల అడుగున్న ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. దీంతో స్వరపేటిక పైన మూతల ఉండే ఎపిగ్లాసిటిస్ మూసుకుపోతుంది. అప్పుడు లోపలి నుంచి వచ్చే గాలి స్వరపేటికకు తగిలి హిక్ అనే శబ్దంతో ఎక్కిళ్లు వస్తుంటాయి.

అసలేంటి ఆ డివైజ్.. ఎలా పనిచేస్తుంది.
ఎక్కిళ్లను తగ్గించేందుకు ఎల్ ఆకారంలో ఉండే ఓ స్ట్రాను టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. దీనికి ఫోర్స్డ్ ఇన్‌స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్ అని పేరు పెట్టారు. చిన్న ట్యూబ్‌లా ఉండే ఈ స్ట్రా అడుగున రెండు వేర్వేరు సైజుల్లో రంధ్రాలు ఉంటాయి. దానికి అమర్చిన లిడ్‌ను జరపడం ద్వారా ఏదో ఒక రంధ్రాన్ని తెరుచుకునేలా చేయవచ్చు. అయితే పిల్లల కోసం చిన్న రంధ్రం, పెద్దల కోసం పెద్ద రంధ్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాను ఒక నీటితో ఉన్న గ్లాసులో ఉంచి పైభాగాన్ని నోట్లోపెట్టుకుని బలంగా పీల్చగానే ఒక్కసారిగా నీళ్లు లోపలికి వెళ్తాయి. అప్పుడు ఎక్కిళ్లు ఆగిపోతాయి.

ఈ డివైజ్‌తో ఎక్కిళ్లు ఎలా ఆగుతాయి.
స్ట్రా లాంటి పరికరంతో నీటిని బలంగా పీల్చినప్పుడు.. ఆ వేగానికి ఎక్కిళ్లకు కారణమైన ఫ్రెనిక్, వేగస్ నాడులు స్పందిస్తాయి. దీనివల్ల డయాఫ్రమ్ మళ్లీ యథాస్థితికి వస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్ తెరుచుకుని గాలి మార్గం సులువు కావడంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి. తమ అధ్యయనంలో భాగంగా ఎక్కిళ్లు వస్తున్న వారితో ఈ స్ట్రాను పరీక్షించి చూడగా.. 92 శాతం మందికి ఎక్కిళ్లు తొందరగానే తగ్గాయని పరిశోధకులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

