Anupama Parameswaran | భోగి ఈవెంట్స్‌కి అనుపమ ఎందుకు రావడం లేదు .. అసలు విషయం చెప్పిన హీరోయిన్.. !
Anupama Parameswaran | టాలీవుడ్లో ప్రస్తుతం ‘భోగి’ సినిమా చుట్టూ మంచి చర్చ నడుస్తోంది. యంగ్ హీరో శర్వానంద్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో శర్వానంద్, డింపుల్ హయాతి తదితరులు సందడి చేస్తున్నారు.
Anupama Parameswaran | టాలీవుడ్లో ప్రస్తుతం ‘భోగి’ సినిమా చుట్టూ మంచి చర్చ నడుస్తోంది. యంగ్ హీరో శర్వానంద్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో శర్వానంద్, డింపుల్ హయాతి తదితరులు సందడి చేస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అసలు అనుపమ ఎందుకు ఈ కార్యక్రమాలకు హాజరు కావడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై అనుపమ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
‘భోగి’ సినిమా ఈవెంట్లకు అనుపమ హాజరు కాకపోవడానికి కారణం తనకు ముందుగా ఉన్న షూటింగ్ కమిట్మెంట్స్ అని వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. సినిమా ప్రయోజనం కోసం షూటింగ్ తేదీల్లో వచ్చిన పలు మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపింది. అయితే చివరకు తన గతంలోనే ఖరారైన ఇతర సినిమా పనుల కారణంగా ఊటీలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చిందని వివరించింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తనకు సహకరించిన ‘భోగి’ చిత్ర బృందానికి అనుపమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం తాను సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా, తన మనసంతా చిత్ర బృందంతోనే ఉందని పేర్కొంది.
ప్రేక్షకులంతా ‘భోగి’ సినిమాను థియేటర్లలో చూసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సినిమా ఈవెంట్లకు అనుపమ రాకపోవడంపై జరుగుతున్న చర్చకు తెరపడినట్లయింది. శర్వానంద్ హీరోగా, డింపుల్ హయాతి హీరోయిన్గా నటించిన ‘భోగి’కి సంపత్ నంది దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OLX Fraud | ఒఎల్ఎక్స్ వస్తువుల విక్రయం పేరుతో సైబర్ మోసాలు.. సోఫా కొంటామంటూ యువతికి రూ.12.20 లక్షల టోకరా
Anupama Parameswaran | భోగి ఈవెంట్స్‌కి అనుపమ ఎందుకు రావడం లేదు .. అసలు విషయం చెప్పిన హీరోయిన్.. !
Voter List Search | ఈసీకి చేతగాని పని పొల్లగానితో సార్థకం..! సులభంగా ఓటరు జాబితాల సెర్చ్
CM Vjay | సుప్రీంకు విజయ్ సర్కార్ క్షమాపణ.. దీపధున్ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ట్రస్టీలు అనుమతి ఇవ్వలేదని వివరణ
Bihar Wedding | 50 లక్షల గులాబ్జామూన్లు.. 4 లక్షల అతిథులు..! బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెండ్లి వైభోగం
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

