Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ప్రొడక్షన్ పనులు షురూ కాబోతున్నాయి. కాగా మహేశ్‌బాబుకు సెలబ్రిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సెలబ్రిటీల్లో చాలా మంది క్రికెటర్లు కూడా ఉంటారు.
మహేశ్ బాబు టైం దొరికితే ఎక్కువగా యాడ్ షూట్ల కోసం టైం కేటాయిస్తుంటాడు. నయా యాడ్ షూట్లో పాల్గొన్న సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు మహేశ్ బాబును కలిశారు. ప్రస్తుతం సన్ రైజర్స్ తరపున (ఐపీఎల్ 2024) ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాట్ కమిన్స్ సూపర్ స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నాడు.
అంతేకాదు మిగితా ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి మహేశ్ బాబుతో సరదాగా చిట్ చాట్ చేశారు. అనంతరం మహేశ్ బాబుతో విడివిడిగా.. గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలు ప్రస్తుతం మూవీ అండ్ స్పోర్ట్స్ లవర్స్‌ను ఫిదా చేస్తున్నాయి. లాంగ్ హెయిర్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్న మహేశ్‌ను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు.
SRH ప్లేయర్స్ సూపర్ స్టార్‌తో ఇలా..