Municipal Elections | హైదరాబాద్/ఆదిలాబాద్/నిర్మల్ అర్బ న్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒకసారిగా వేడెకింది. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకొనేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. ఇప్పటికే బీజేపీ తమ గెలుపుగుర్రాలను క్యాంపులకు తరలించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా అదేబాటలో సాగుతున్నాయి.
ముఖ్యంగా వేములవాడ మున్సిపాలిటీ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీశాయి. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చైర్పర్సన్, మేయర్ పీఠాలను దకించుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 16న జరిగే పరోక్ష ఎన్నికల్లో ఎకడ తమ అభ్యర్థులు చేజారిపోతారోననే భయంతో ముందస్తుగానే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వేములవాడ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు క్యాంపులకు వెళ్లడం అకడి ఉతంఠను వెల్లడిస్తున్నది. గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది అభ్యర్థులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో సమావేశమయ్యారు. ఆయన సూచనల మేరకు ప్రత్యేక బస్సుల్లో అజ్ఞాత ప్రాంతాలకు తరలివెళ్లారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం క్యాంపునకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీజేపీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనలతో క్యాంపునకు వెళ్లారు. ఆదిలాబాద్లో మున్సిపాలిటీ బీజేపీ, కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. మున్సిపాలిటీలో 49 వార్డుల ఉండగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రెండు వాహనాల్లో బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్రకు పంపించారు. కాంగ్రెస్ నాయకులు సైతం తమ అభ్యర్థులను మహారాష్ట్రకు పంపించారు. నిర్మల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.