బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఇటీవల బైపాస్ సర్జరీ అయింది. మందులు అధికంగా వాడటం వల్ల బీపీ కూడా వచ్చింది. అయితే నాకు కోరికలు ఎక్కువ. భార్యతో శారీరకంగా కలిసేటప్పుడు గుండెదడ పెరిగింది. భయమేసింది. ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదు.
మేడమ్ నా వయసు 45. ఇటీవల బైపాస్ సర్జరీ అయింది. మందులు అధికంగా వాడటం వల్ల బీపీ కూడా వచ్చింది. అయితే నాకు సెక్స్ కోరికలు ఎక్కువ. భార్యతో శారీరకంగా కలిసేటప్పుడు గుండెదడ పెరిగింది. భయమేసింది. ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదు. నేను ఎప్పటి నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు? ఏమైనా మందులు వాడాలా? పరిష్కారం చూపండి. – ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, ఆపరేషన్లు అయినవారు.. డాక్టర్లు, సెక్సాలజిస్టుల సలహా పాటించకుండా సెక్స్‌లో పాల్గొంటే మొదటికే మోసం వస్తుంది. గుండెవేగం పెరిగి హఠాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. మయో కార్డియాక్ ఇన్ఫ్రాక్షన్, ఏంజైనా పెక్టోరిస్ అనే గుండెపోట్లకు గురైనవారు, బైపాస్ సర్జరీ అయిన వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. 3-6 నెలల తర్వాతే పాల్గొనాలి.
ఈ సూచనలు తప్పక పాటించండి :
- కార్డియాలజిస్ట్ రాసిచ్చిన మందులు ప్రతిరోజూ వేసుకోవాలి.
- భోజనం చేసిన 2 గంటల లోపల గుండె జబ్బులున్న వారే కాదు, ఆరోగ్యవంతులు కూడా సెక్స్‌లో పాల్గొనవద్దు.
- అనేబుల్ ఏంజైనా, క్రానిక్ ఏంజైనా లాంటి గుండె జబ్బులుంటే.. సెక్స్‌లో పాల్గొనడానికి గంట ముందు డాక్టర్ రాసిచ్చే బీటా బ్లాకర్ (మందు పేరు వేరే ఉంటుంది) మందును వేసుకోవాల్సిరావచ్చు.
- గుండెపై, పొట్టపై తక్కువ శ్రమ కలిగించే శృంగార భంగిమలు ఉత్తమం.
అతి ముఖ్యమైన జాగ్రత్తలు :
- ‘సిల్డెన్‌ఫిల్ సిట్రేట్’, ‘టేడాల్ఫిల్ సిట్రేట్’ అనే లైంగిక ఉద్దీపన మందులు గుండె జబ్బులు, బీపీ ఉన్న వారు వాడకూడదు.
- వాటివల్ల హార్ట్ఎటాక్, పెరాలిసిస్ రావచ్చు. కంటిచూపు పోవచ్చు. ఇవి ప్రమాదకరం. ఈ మందుల వల్ల అంగం రాయిలా గట్టిపడుతుంది. నపుంసకత్వానికి కూడా దారితీస్తుంది.
- సహజమైన సైకో సెక్సువల్, మెరైటల్ థెరపీ ద్వారా దంపతులు వారానికి కనీసం రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చు.
- సెక్సువల్ కౌన్సెలింగ్, రిహాబిలిటేషన్ అనేది హృద్రోగుల జీవితంలో చాలా ప్రమాదాల్ని నివారిస్తుంది. కాబట్టి, హృద్రోగులు కార్డియాలజిస్ట్‌తో పాటుగా సెక్సాలజిస్ట్‌ను కూడా కలవాలి. జీవిత భాగస్వామిపై ప్రేమ, నమ్మకం కూడా లైంగిక విజయానికి సోపానాలే.
డా. భారతి (ఎమ్మెస్)
Sexologist & psychotherapist
మారిటల్ కౌన్సిలర్, జయా హాస్పిటల్
బీ.ఎన్ రెడ్డి నగర్ ,హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Couple
- Health
- health tips
- Husband
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

