బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?

మేడమ్! నా వయసు 30. మూడేండ్ల బాబు ఉన్నాడు. ఇన్నేండ్లు పిల్లలు వద్దనుకొన్నాం. ఇప్పుడు కావాలని అనుకొంటున్నాం. అయితే, మా వారితో సెక్స్ చేశాక నా యోనిలోంచి వీర్యం బయటకు వచ్చేస్తున్నది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా కాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరే మా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఓ సోదరి
కలయిక తర్వాత వీర్యం బయటకు వచ్చినా ఏ నష్టమూ ఉండదు. 70 శాతం వీర్యకణాలు యోనినుంచి గర్భాశయంలోకి వెళ్లిపోతాయి. కొన్ని శుక్రకణాలు యోని నాళపు గోడల్లోని మ్యూకస్లో రెండు రోజుల వరకు ఉండిపోతాయి. కేవలం ద్రవం మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా.. అండం విడుదలయ్యే ఫెర్టిలిటీ పీరియడ్‌లో కలువడమే. ప్రెగ్నెన్సీ కావాలనుకున్న భార్యాభర్తలు శారీరకంగా కలిసే ముందే మూత్ర విసర్జన చేయాలి. ఆ సమయంలో మీరు మీ నడుముకు కొంచెం కింద, పిరుదులకు ఎత్తుగా ఉండేలా దిండు పెట్టుకొని కలవండి. వీర్య స్ఖలనం తర్వాత ఒక అరగంట అలాగే ఉండండి. ప్రతీసారి ఈ పద్ధతుల్లోనే కలవండి. వీర్యం యోని నాళం నుండి బయటకు రావడం సమస్య కానే కాదు.
సుఖవ్యాధులు సోకిన పురుషులు జంతువులతో కలిస్తే రోగాలు పూర్తిగా తగ్గుతాయని చెబుతారు. నిజమేనా?
- ఓ పాఠకుడు
ఇది వాస్తవం కాదు. వికృత మనస్తత్వం, తీవ్ర మానసిక సమస్యలు ఉన్న పురుషులు అసహజ పద్ధతుల్లో శృంగారంలోని ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే ఈ తరహా అనైతిక శృంగారాలకు పాల్పడుతుంటారన్నది పరిశీలకుల అంచనా. నోరెత్తని, అరవలేని, ప్రతిఘటించలేని పసిపిల్లల్ని, జంతువుల్ని వారు ఇందుకు ఎన్నుకోవటం చాలా బాధాకరం.
ఈ విపరీత పోకడ ‘ఫీడోఫీలియా’, ‘బీస్టాలిటీ’ అనే తీవ్ర మానసిక వ్యాధులకు దారితీస్తుంది. దీంతో అమాయక ఆడపిల్లలు, చిన్నపిల్లలు వీరి మనో లైంగిక వికారాలకు బలవుతుంటారు. నోరులేని సాధు జంతువులను సైతం
వదలరంటే, వారి మానసిక దిగజారుడుతనాన్ని ఊహించుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలవల్ల సుఖవ్యాధులు తగ్గుతాయనుకోవడం భ్రమ. వ్యాధులు వస్తే చికిత్స తీసుకోవడం మినహా గత్యంతరం లేదు. నిపుణులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇంకా అవసరమైతే సైకోథెరపీ తీసుకోవాలి. అంతేకానీ, వక్రమార్గాల్లో పరిష్కారాలను వెతకడం సరికాదు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

