e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News ప‌క్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..

ప‌క్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..

నాకు 25 ఏండ్లు. డిగ్రీ చేశాను. మా పక్కింటి ఆంటీ(30) అంటే చాలా ఇష్టం. ఏదో ఒక వంకతో వాళ్లింటికి వెళుతుంటాను. దీంతో రోజురోజుకూ ఆమెపై ప్రేమ పెరిగిపోతుంది. ఆంటీతో సెక్స్‌లో పాల్గొనాలనే కోరికలు విపరీతమయ్యాయి. ఒకరోజు విషయం చెబితే కోపంగా చూసి, లోపలికి వెళ్లి పోయింది. అప్పట్నించి అంకుల్‌ ఆంటీని అనుమానించడం, నన్ను కోపంగా చూడటం మొదలుపెట్టారు. ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నా.

– సంపత్‌, మెదక్‌

- Advertisement -

నీదొక ఆరాచకమైన ఆలోచన. డిగ్రీ చదివికూడా దిగజారి ఆలోచిస్తున్నావు. పెండ్లయిన ఒక స్త్రీ పైన కోరిక పెంచుకుని ఆమెకు ప్రపోజ్‌ చేశావు. పైగా అమాయకంగా ప్రవర్తిస్తున్నావు. ఆ అమ్మాయి తన భర్తకు నీ గురించి చెప్పే ఉంటుంది. అతను నిన్ను శిక్షించాల్సింది పోయి తన భార్యనే అనుమానిస్తూ ఆమెను వేధిస్తున్నాడు. అసలు నీకంటే కేవలం 5 ఏండ్లు పెద్దదయిన ఆ అమ్మాయి నీకు ఆంటీ ఎలా అయింది? ఆమెకు నువ్వు ప్రపోజ్‌ చేసిన వెంటనే నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కనీసం ఆమె భర్త అయినా ఆ పని చేస్తే బాగుండేది. ఇకనైనా ఆ వికారపు చేష్టలు, ఆలోచనలు కట్టిపెట్టి దూరంగా వెళ్లి మంచిగా చదువుకో. మంచి ఉద్యోగం వస్తే పెండ్లి చేసుకో. లేకపోతే నీవల్ల మరిన్ని జంటలు విడిపోయే ప్రమాదముంది. నీ నీచ, దైహిక వాంఛలకు ‘ప్రేమ’ అనే పేరు పెట్టకు. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. దాన్ని కలుషితం చెయ్యకు.

డా. భారతి (ఎమ్మెస్‌)
మారిటల్‌ కౌన్సిలర్‌, సైకోథెరపిస్ట్‌,
జయా హాస్పిటల్‌
బీ.ఎన్‌. రెడ్డి నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
bharathid506@gmail.com, 9908383910

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బైపాస్‌ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?

ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?

తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు

ఈ మ‌ధ్యే పెండ్ల‌యింది.. నా అనుమానం నిజమేనా

ఆరు నెల‌లుగా మా ఆవిడ ముట్టుకోనివ్వ‌డం లేదు.. ఏం చేయమంటారు?

శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..

బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement