MI vs RR | కుమ్మేసిన తిలక్, వధేరా.. రాజస్థాన్ లక్ష్యం..?
MI vs RR : పదిహేడో సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) కుర్రాళ్ల విధ్వంసంతో భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరగా.. పాండ్యా సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ముంబైని కుర్రాళ్లు తిలక్ వర్మ(65), నేహల్ వధేరా(49)లు ఆదుకున్నారు.
MI vs RR : పదిహేడో సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) కుర్రాళ్ల విధ్వంసంతో భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరగా.. పాండ్యా సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ముంబైని కుర్రాళ్లు తిలక్ వర్మ(65), నేహల్ వధేరా(49)లు ఆదుకున్నారు.
రాజస్థాన్ బౌలిగ్ యూనిట్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఐదో వికెట్‌కు 99 రన్స్ జోడించారు. అయితే.. చివరి మూడు ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు ముంబై జోరుకు ముకుతాడు వేశారు. పేసర్ సందీప్ శర్మ(5/18) సూపర్ స్పెల్‌తో కట్టడి చేశాడు. దాంతో, ముంబై 179 పరుగులకే పరిమితమైంది.
𝙁𝙄𝙁𝙀𝙍 for Sandeep Sharma in Jaipur! 👏👏
Exceptional bowling display from the right-arm seamer 🙌
Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI pic.twitter.com/FJ2Y6UPmuv
— IndianPremierLeague (@IPL) April 22, 2024
బౌల్ట్ ఆఖరి బంతికి
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకొని సాహసమే చేశాడు. అయితే.. అతడి ఎంత పొరపాటు చేశాడో ఆదిలోనే ముంబైకి తెలిసొచ్చింది. బౌల్ట్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ(6)ను ఔట్ చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బంతి అందుకున్న సందీప్ శర్మ డేంజరస్ ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్ యాదవ్(10)లను వెనక్కి పంపి ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. 20 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ముంబైకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(65), నేహల్ వధేరా(49)లు ఆపద్భాందవుల్లా మారారు.
5️⃣0️⃣-run partnership for the 5th wicket 👌
Tilak Varma 🤝 Nehal Wadhera
Mumbai Indians move to 120/4 after 14 overs 🙌
Follow the Match ▶️ https://t.co/Mb1gd0UN68 #TATAIPL | #RRvMI pic.twitter.com/KlWTkmmHzL
— IndianPremierLeague (@IPL) April 22, 2024
మొదట్లో ఆచితూచి ఆడి ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయారు. అయితే.. సందీప్ ఊరించే బంతితో వధేరాను ఔట్ చేసి పరుగుల ప్రవాహానికి తెరదించాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(10), టిమ్ డెవిడ్(3)లు నిరాశపరచడంతో ముంబై సంజూ సేనకు మోస్తరు టార్గెట్ నిర్దేశించగలిగింది.
చాహల్ 200
ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ చాహల్ అరుదైన ఫీట్ సాధించాడు. నబీ వికెట్ తీసిన ఈ స్పిన్ మాంత్రికుడు 200 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. నబీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ పట్టగానే చాహల్ హే నేను సాధించాను అన్నట్టుగా చేతులు కదుపుతూ సంబురాలు చేసుకున్నాడు.
Sensational! 🫡
What a moment for Yuzvendra Chahal! 🩷
He completes 2️⃣0️⃣0️⃣ wickets in the IPL 👏👏
Follow the Match ▶️ https://t.co/Mb1gd0UfgA #TATAIPL | #RRvMI | @yuzi_chahal pic.twitter.com/lc10KlxEYj
— IndianPremierLeague (@IPL) April 22, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

