Health tips : కొంతమంది వేడివేడి ఆహారం (Hot food) తీసుకున్న తర్వాత చల్లదనం కోసం వెంటనే చల్లటి నీళ్లు (Cold water) తాగుతారు. అయితే ఇలా వేడి ఆహారం తినగానే చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యల (Health issues) ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లటి నీళ్లు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌లు, గ్యాస్ట్రిక్ రసాలు చురుకుగా పనిచేస్తాయి. మనం బాగా చల్లటి నీళ్లు తాగినప్పుడు శరీర అంతర్గత ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. అది జీర్ణ ప్రక్రియను నెమ్మదింప జేస్తుంది. అయితే వ్యక్తివ్యక్తికి మధ్య శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థపై చల్లటి నీళ్ల ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది.
మనుషుల సాధారణ శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెల్సియస్. మీరు వేడి ఆహారం తిన్న వెంటనే చల్లని నీళ్లు తీసుకుంటే అది శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా గొంతులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే గొంతు నొప్పి, కఫం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
చల్లటి నీళ్లు ఎక్కువగా తాగడంవల్ల శరీర సహజ ఉష్ణోగ్రతపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. చల్లటి నీళ్లవల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. అది శరీరంలో రక్త ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తుంది.
చల్లటి నీళ్లు జీర్ణ ఎంజైమ్‌ల క్రియాశీలతను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అది శరీర జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. దాంతో బరువు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వేడివేడి ఆహారం తిన్న వెంటనే చల్లటి నీళ్లు తాగకుండా కనీసం ఆరగంట తర్వాత తాగడం మంచిది.