యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి(Bhuvanagiri )జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డను ఓ తల్లి గొంతు కోసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలని భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో బెజ్జంగి రత్నకళ అనే మహిళ తన కూతురు కీర్తన రెడ్డి (14)గొంతు కోసి హత్య చేసింది. కొడుకు బెజ్జంగి అంశాంత్ రెడ్డి నీ కూడా కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నించగా తప్పించుకుని కేకలు వేస్తూ పారిపోయాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
AP News | రాత్రంతా బైక్ ఇంజిన్‌లో ఆన్‌లో.. పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
Election Schedule | దేశంలో మళ్లీ ఎన్నికల కోలాహలం.. ఈ సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Donald Trump | ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్‌కప్‌లో ట్రంప్‌పై నిషేధం.. కారణమిదే..!