కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్( IIT Kharagpur)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్య ఘటన జరగడం ఇది నాలుగోది. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న రిథమ్ మొండల్ అనే విద్యార్థి తన రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. క్యాంపస్‌లోని రాజేంద్ర ప్రసాద్ హాల్ అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థి కోల్‌కతాకు చెందినవాడు. గురువారం రాత్రి డిన్నర్ ముగిసిన తర్వాత అతను రూమ్‌కు వెళ్లాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి తేడా కనిపించలేదని హాస్టల్లోని విద్యార్థులు పేర్కొన్నారు.
ఎన్ని సార్లు తలుపు కొట్టినా అతను తీయలేదని ఐఐటీ కేజీపీ అధికారి ఒకరు తెలిపారు. హాస్టల్ సెక్యూర్టీ గార్డులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో డోర్లను పగులగొట్టారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ పేరెంట్స్ కు సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు. విద్యార్థి మృతితో క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 12వ తేదీన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న షాన్ మాలిక్ అనే విద్యార్థి కూడా ఉరివేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీన ఓషియన్ ఇంజినీరింగ్ చదువుతున్న అనికేత్ వాకర్ కూడా ఉరి వేసుకున్నాడు. మే 4వత ఏదీన బీటెక్ చదువుతున్న మహమ్మద్ ఆసిఫ్ ఖామర్ అనే విద్యార్థి కూడా హాస్టల్ రూమ్‌లో మృతిచెందాడు.