సోమవారం 01 మార్చి 2021
Gadwal - Aug 16, 2020 , 03:38:03

కరోనా వైరస్‌కు ఎవరూ భయపడొద్దు

కరోనా వైరస్‌కు ఎవరూ భయపడొద్దు

పెద్దమందడి : కరోనా వైరస్‌కు ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తలు పాటిస్తే చాలని ఎంపీపీ తూడి మెగారెడ్డి, పెద్దమందడి ఆరోగ్య కేంద్రం వైద్యుడు ఇస్మాయిల్‌ అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పెద్దమందడి ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందిని, మొదటగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న మద్దిగట్ల గ్రామానికి చెందిన అంజనమ్మను డాక్టర్‌ సాయితేజ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఓంప్రకాష్‌లతో కలిసి శాలువా, పూలబొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నియమాలు పాటిస్తే కరోనా వైరస్‌ ఏమీ చేయలేదన్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. వైరస్‌ కట్టడికి పెద్దమందడి ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ భానుప్రసాద్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి, సర్పంచ్‌ సత్యారెడ్డి ఉన్నారు.

VIDEOS

logo