ఆక్సిజన్ కొరత.. 20 మంది మృతి, మరో 200 మంది ప్రాణాలకు ముప్పు
ఆక్సిజన్ కొరత | తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 22 మంది కరోనా రోగులు చనిపోయిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అర గంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
బాట్రా హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి
ఢిల్లీలోని బాట్రా హాస్పిటల్నూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో 350 మంది రోగులు కరోనా చికిత్స పొందుతున్నారని ఆ ఆస్పత్రి వైద్యుడు గుప్తా తెలిపారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఒక ఆక్సిజన్ ట్యాంకర్ను సమకూర్చిందని చెప్పారు. ఇది కేవలం గంటన్నర వరకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రతి రోజు తమ ఆస్పత్రికి 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ ఢిల్లీ ప్రభుత్వం పంపింది మాత్రం కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే అని గుప్తా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
ఇక ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ తప్పనిసరి
విపత్తులో తెలియును భాగ్యనగర మహత్తు
చిన్నారులపై వైరస్ పంజా!
మే ఆఖరుకు తగ్గుముఖం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

