శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 21:51:15

చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

ముంబై: మహారాష్ట్రలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పూణేలోని హడప్సర్ ప్రాంతంలోని రామ్‌టెక్డి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. సుమారు 11 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ప్లాంట్‌లోని నూతన భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు నిర్మాణ కార్మికులు మంటలకు ఆహుతై మరణించారు.

ఈ ఘటనను మరువక ముందే తాజాగా పూణేలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. హడప్సర్ ప్రాంతంలోని రామ్‌టెక్డి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo