భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. మరోసారి ధరలు పెంచిన కంపెనీలు
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు | దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. తాజాగా.. ఒక రోజు విరామం తర్వాత ఆదివారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. లీటర్ పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.22, డీజిల్ ధర రూ.87.97కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44కు పెరిగింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏడు, ఎనిమిది రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. దేశంలో అత్యధిక ధర రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.108.37కు చేరగా.. డీజిల్ ధర రూ.101.12కు చేరింది. గత నెల మేలో ఇంధన ధరలను 16 సార్లు సవరించగా.. జూన్‌లో ఇప్పటి వరకు 12 సార్లు పెరిగాయి. గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ధరలు పైకి కదులుతూ వస్తున్నాయి.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.97.22.. డీజిల్ రూ.87.97
ముంబైలో పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.04, డీజిల్ రూ.95.89
విజయవాడలో రూ.102.98, డీజిల్ రూ.97.26
కోల్‌కతాలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.90.82
చెన్నైలో పెట్రోల్ రూ.98.40, డీజిల్ రూ.92.58
భోపాల్‌లో పెట్రోల్ రూ.105.43, డీజిల్రూ.96.65
రాంచీలో పెట్రోల్రూ.93.13, డీజిల్రూ.92.86
బెంగళూరులో పెట్రోల్రూ.100.47, డీజిల్రూ.93.26
పాట్నాలో పెట్రోల్రూ.99.28, డీజిల్రూ.93.30
చండీగఢ్‌లో పెట్రోల్రూ.93.50, డీజిల్రూ.87.62
లక్నోలో పెట్రోల్రూ.94.42, డీజిల్రూ.88.38
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

