Peddi | ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వలో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పెద్ది (Peddi). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా గా వస్తోన్న పెద్ది నుంచి ఇప్పటికే విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ ఇండియాతోపాటు సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ది ఏప్రిల్ 30న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ముందుగా ప్రకటించారని తెలిసిందే.
ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. పెద్ది ఏప్రిల్ 30న రావడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు పెద్ది జూన్ లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించారు. అయితే ఈ సారి మరో ట్విస్ట్ ఇస్తూ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు. సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని, అవుట్ ఫుట్ పూర్తిగా సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ వెల్లడించారు. తాజా వాయిదాతో మేకర్స్‌కు మరింత సమయం రానుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం దొరికిందన్నమాట.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/io4MFHfXJy
— PEDDI (@PeddiMovieOffl) April 15, 2026
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు