e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home తెలంగాణ తెలంగాణ జనాభా 3.72 కోట్లు

తెలంగాణ జనాభా 3.72 కోట్లు

తెలంగాణ జనాభా 3.72 కోట్లు
  • 100 శాతం జననాల నమోదు
  • మరణాల నమోదులో నాలుగో స్థానం
  • పెద్ద రాష్ర్టాల లింగనిష్పత్తిలో మూడో స్థానం
  • కేంద్ర జనగణన విభాగం 2019 నివేదికలో వెల్లడి
  • కేంద్ర జనగణన విభాగం వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర జనాభా 2019లో సుమారు 3.72 కోట్లు ఉండొచ్చని కేంద్ర జనగణన విభాగం పేర్కొన్నది. ఆ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు నమోదైన జనన, మరణాల ఆధారంగా తాజాగా జనాభా నివేదికను విడుదల చేసింది. 2019 చివరినాటికి దేశ జనాభా దేశ 133.89 కోట్లుగా పేర్కొన్నది. ఆ ఏడాది 2.67 కోట్ల మంది జన్మించారని, 83 లక్షల మంది దాకా మరణించి ఉంటారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 1.65 లక్షల మంది నవజాత శిశువులు మరణించినట్టు తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 2.2 శాతంగా పేర్కొన్నది. తెలంగాణలో ఆ ఏడాది 8.41 లక్షల మంది జన్మించారని, 2.34 లక్షల మంది మరణించారని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రతి గంటకు 96 మంది పిల్లలు జన్మించారు. అదేసమయంలో సుమారు 27 మంది మరణించారు.

పుట్టిన ప్రతి బిడ్డ వివరాల సేకరణ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ వివరాలను సేకరిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019లో రాష్ట్రంలో జననాల నమోదు 100 శాతం నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ర్టాల్లో నూరు శాతం నమోదయ్యాయి. అదే సమయంలో జాతీయ సగటు 92.7 శాతంగా ఉన్నది. జననాల నమోదు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యూనిఫైడ్‌ బర్త్స్‌ అండ్‌ డెత్స్‌’ (యూబీడీ) సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నదని నివేదికలో పేర్కొన్నది. సర్టిఫికెట్లన్నీ ఆన్‌లైన్‌లో మీ-సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారని, ఎవరికీ తిరస్కరించలేదని స్పష్టం చేసింది. 2018లోనూ తెలంగాణలో 100 శాతం జననాలు నమోదయ్యాయి. మరోవైపు 2019లో రాష్ట్రంలో 97.2 శాతం మరణాలు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది.

- Advertisement -

2019లో తెలంగాణలో నమోదైన జననాలు 8,41,268
బాలురు 4,30,652
బాలికలు 4,10,616
రాష్ట్రంలో మెరుగుపడ్డ లింగనిష్పత్తి

2019
1000 (బాలురు)
953 (బాలికలు)

2017
1000 (బాలురు)
915 (బాలికలు)

(పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల జననాలు ఎక్కువ సంఖ్యలో నమోదుకావటం విశేషం)

ఇతర ప్రధానాంశాలు

  • దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో దవాఖాన ప్రసవాల సంఖ్య పెరిగింది. 2019లో నమోదైన మొత్తం జననాల్లో 81.2 శాతం దవాఖానల్లోనే జరిగాయి. 8.4 శాతం ప్రసవాలు వైద్యుల పర్యవేక్షణలో, 4.5 శాతం ప్రసవాలు నర్సులు లేదా మంత్రసానుల పర్యవేక్షణలో జరిగాయి.
  • దేశవ్యాప్తంగా చూసినప్పుడు 49.1 శాతం మంది వైద్య సహాయం పొందుతూ దవాఖానలో లేదా దవాఖాన బయట మరణించారు. అదేసమయంలో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సహాయం అందలేదని నివేదిక తెలిపింది. ఇవన్నీ సహజ మరణాలు కావొచ్చని అభిప్రాయపడింది.
  • గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నవజాత శిశువుల మరణాల శాతం పట్టణాల్లో ఎక్కువగా ఉన్నది. 2019లో మొత్తం 1.65 లక్షల శిశుమరణాలు నమోదయ్యాయి. ఇందులో పట్టణాల్లో 75.5 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 24.5 శాతం మంది మరణించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
  • జననాల్లోనే కాదు నవజాత శిశు మరణాల్లోనూ బాలుర సంఖ్య ఎక్కువగా ఉన్నది. 2019లో 95,803 బాలురు, 69,404 మంది బాలికలు మృతిచెందారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
తెలంగాణ జనాభా 3.72 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement