Lok Sabha Elections | 3 గంటలకు ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్ 54, కరీంనగర్ 53, వరంగల్ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్ 42, నిజామాబాద్ 42, జహీరాబాద్ 40, నాగర్ కర్నూల్ 34, మహబూబాబాద్ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

