Redmi A7 Pro 5G : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి రెడ్మి సిరీస్‌లో మరో ఫోన్ విడుదలైంది. రెడ్మి ఏ7 ప్రో పేరుతో ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది. విదేశాల్లో ఇప్పటికే విడుదలైన ఈ ఫోన్ ఇండియాలో గత సోమవారం విడుదలైంది. బుధవారం, ఏప్రిల్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, షావోమీ సైట్లలో ఫోన్ సేల్కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లు, ధర వంటి వివరాలివి.
6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ర యునిసాక్ చిప్సెట్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ బేస్డ్ హైపర్ ఓఎస్ 3, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 32 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, నాలుగేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, బ్లూటూత్ 5.4, ఐపీ 52 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. బ్లాక్, మిస్ట్ బ్లూ, సన్‌సెట్ ఆరెంజ్ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.11,499 / రూ.12,499.