ముంబై, ఆగస్టు 13 : టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో నూతన వ్యక్తి కోసం టాటా ట్రస్ట్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చంద్రశేఖరన్ పునర్నియామకానికి తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించకూడదన్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ పేర్కొంది.
ఆయన సారథ్యంలో టాటా గ్రూపునకు చెందిన అన్ని సంస్థలు రాణించాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.