Donald Trump | హార్ముజ్ విషయంలో యూఎస్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా హామీ: ట్రంప్
Donald Trump : హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలకు చైనా మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, ఈ యుద్ధంలో ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ ఇచ్చిందని కూడా ట్రంప్ తెలిపారు.
Donald Trump : హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలకు చైనా మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, ఈ యుద్ధంలో ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ ఇచ్చిందని కూడా ట్రంప్ తెలిపారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పని చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
హార్ముజ్‌ను పూర్తిగా, శాశ్వతంగా తెరిచేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలపై చైనా సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు. ఈ చర్య వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచానికి కూడా మేలు జరుగుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని, నవంబర్ నాటికి చమురు ధరలు భారీగా తగ్గుతాయన్నారు. చమురు ధరలు పెరుగుతాయని తాను చెప్పినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు. తాను త్వరలో చైనాలో పర్యటిస్తానని, ఈ సందర్భంగా జిన్‌పింగ్ తనకు మంచి ఆతిథ్యం ఇస్తాడని, అలాగే తనను హత్తుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. చైనాతో సహకారం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో ట్రంప్ చైనాలో పర్యటించాల్సి ఉంది.
ఎనిమిదేళ్ల తర్వాత ట్రంప్ చైనాలో పర్యటించబోతున్నారు. అయితే, ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఈ పర్యటన ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు నాటో మద్దతు లేకపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. నాటో అమెరికాకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

