e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌

కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌

కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌

ముంబై : బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ కరోనా టీకా తీసుకున్నారు. సర్ హెచ్ఎన్ ఫౌండేషన్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ మొదటి మోతాదును అందుకోగా.. ఈ మేరకు ఇస్టాగ్రామ్‌లో ఫొటోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా తనకు టీకా వేసిన వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ టీకా తీసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబర్‌లో వరుణ్‌ ధావన్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఇంట్లోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. వరుణ్ ధావన్ చివరిసారిగా కూలీ నం.1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం మిస్టర్‌ లేలే, జగ్‌ జగ్‌ జియో చిత్రాల్లో నటిస్తున్నాడు.

త్వరలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ టీకా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అమితాబచ్చన్‌, ధర్మేంద్ర, హేమమాలిని, సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌దత్‌, అనుపమ్‌ఖేర్‌, సోనాలి బింద్రే, మలైకా అరోరా, అనురాగ్‌ కష్యప్‌, సోనుసూద్‌, నగ్మా, అశుతోష్ రాణా, షెఫాలి షా, జిమ్మీ షీర్గిల్, దిలీప్ జోషి, రోహిత్ శెట్టి, రాహుల్‌ దేవ్‌, జానిలీవర్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు టీకాలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌

ట్రెండింగ్‌

Advertisement