ఆదివారం 07 మార్చి 2021
Cinema - Dec 20, 2020 , 16:21:11

యువ డైరెక్ట‌ర్లంతా ఒక్క‌చోట చేరారు

యువ డైరెక్ట‌ర్లంతా ఒక్క‌చోట చేరారు

టాలీవుడ్ లో త‌మ హ‌వా న‌డిపిస్తున్న యువ ద‌ర్శ‌కులంతా ఒక్క‌చోట చేరారు. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ఇల్లు యువ ద‌ర్శ‌కుల మీటింగ్ కు వేదికైంది. కిశోర్ తిరుమ‌ల‌, గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, సంతోష్ శ్రీనివాస్, వెంకీ కుడుముల హీరో రామ్ తో క‌లిసి దిగిన ఫొటో ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రామ్ తో సంతోష్ శ్రీనివాస్ రెండు సినిమాలు చేశాడు. గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో ఒక చిత్రంలో న‌టించాడు. రామ్ న‌టించిన మూడు సినిమాల‌కు అనిల్‌రావిపూడి రైట‌ర్ గా ప‌నిచేశాడు. వెంకీకుడుముల‌తో రామ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది.

చాలా రోజుల త‌ర్వా త ఇలా యంగ్ హీరోలంతా క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. ఒక‌రికొక‌రు సినిమాలు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం కిశోర్ తిరు‌మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు రామ్‌.  వీరిద్ద‌రిలో కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూడో చిత్ర‌మిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo