బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt) టైటిల్ రోల్ పోషించిన చిత్రం గంగూభాయ్ కథియావాడి (Gangubhai Kathiawadi). టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది అలియాభట్. ఈ సినిమాలో అలియాభట్ వైట్ అండ్ వైట్ చీరకట్టులో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కనిపించే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కాగా ఇపుడు ఓ టాలీవుడ్ నటి గంగూభాయ్ కథియావాడిలా మారిపోయింది.
అదేంటి ఈ సినిమా ఏమైనా తెలుగులో రీమేక్ అవుతుందా..ఏంటీ అనుకుంటున్నారా..? ఇంతకీ ఆ నటి ఎవరనే కదా మీ డౌటు. నిహారిక కొణిదెల (Niharika Konidela)..కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న నిహారిక నిర్మాతగా మారింది. అయితే ఆదివారం రాత్రి తన ఫ్రెండ్, యాంకర్ నిఖిల్ పుట్టినరోజు వేడుకలకు నిహారిక హాజరైంది. బర్త్ డే ఈవెంట్లో మూవీ థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే నిహారికకు గంగూభాయ్ థీమ్ వచ్చింది.
ఇక వెంటనే అలియాభట్‌ను మరిచిపోయేలా గంగూభాయ్ కథియావాడి లుక్‌లోకి మారిపోయింది నిహారిక. తెలుపు రంగు చీరలో, నల్ల కళ్లద్దాలతో గంగూభాయ్‌ను అచ్చు గుద్దేసినట్టు తయారైంది. అలియా ట్రేడ్ మార్క్ ఫోజును నిహారిక రీక్రియేట్ చేసి కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఇపుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.