Godfather | నిరాశలో మెగా అభిమానులు..ఇప్పటికైనా మొదలయ్యేనా..?
తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్ (Godfather). అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న వార్త ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా మేకర్స్ ఇప్పటికే సల్మాన్, చిరుపై వచ్చే ఫస్ట్ సాంగ్ ప్రోమో ‘థార్ మార్ థక్కర్ మార్’ ను విడుదల చేశారు. దీంతోపాటు టీజర్ కూడా లాంఛ్ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న వార్త ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ కారణమేంటనుకుంటున్నారా..? సాధారణంగా చిరంజీవి సినిమా వస్తుందంటే ప్రమోషన్స్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం కేవలం ఒక్క పాట, టీజర్ మినహా పెద్దగా ప్రచార కార్యక్రమాలేవి కనిపించకపోవడమే అభిమానుల నిరాశకు కారణమట. విడుదలకు ఇంకా రెండు వారాల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ట్రైలర్ లాంఛింగ్ విషయంలో, ప్రమోషన్స్ ను మొదలుపెట్టడంలో, హిందీ విడుదల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడంలో జాప్యం నెలకొనడంతో
కొందరు అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారట.
అయితే ప్రమోషన్స్ ఇంత నెమ్మదిగా ఉండటానికి గల కారణమేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ వారం నుంచైనా ప్రమోషన్స్ మొదలుపెట్టకపోతే ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశాలున్నాయని పలువురు సినీ జనాలు, ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గాడ్ ఫాదర్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Golisoda song | జిన్నా నుంచి ‘గోలీ సోడా’ మాస్ బీట్ సాంగ్..వీడియో
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

