Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar) కాంబోలో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2) ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇండియన్ 2 (Indian 2). కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar) కాంబోలో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ అంటే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ 2 లో కూడా ఎవరూ చేయని కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడట లోకనాయకుడు.
క్రేజీ టాక్ ప్రకారం కమల్ హాసన్ ఈ చిత్రంలో ఏకంగా 14 భాషల్లో మాట్లాడబోతున్నాడట. తాజా అప్డేట్ ఏంటంటే..ఇండియన్ 2లో 14 భాషల్లో వచ్చే 10 నిమిషాల డైలాగ్ ఉండనుందట. అంతేకాదు ఈ డైలాగ్ కూడా సింగిల్ షాట్లో ఉండబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోండగా..సీన్లో కమల్ హాసన్ స్టన్నింగ్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టి..సెట్స్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యేలా చేశాడని కోలీవుడ్ సర్కిల్ టాక్.
కమల్-శంకర్ ప్రాజెక్టుపై తాజా న్యూస్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..బాబీ సింహా, సిద్దార్థ్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన కమల్ హాసన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

