తన అందంతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ (Bollywood) భామ సన్నీలియోన్ (Sunny Leone). ఈ బ్యూటీ సినిమాలతోనే కాదు సోషల్మీడియాతోనూ అందరినీ కట్టిపడేస్తుంటుంది. ‘పరువం వానగా నేడు కురిసేనులే..ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే..’ఈ సూపర్ హిట్ ట్రాక్ సన్నీలియోన్ షేర్ చేసిన వీడియోకు సరిగ్గా సరిపోతుందేమో.
ఎప్పటికపుడు కొత్త కొత్తగా కనిపిస్తూ..అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. సన్నీలియోన్ బీచ్ (Sunny Leone Maldives)లో కనిపించిందంటే చాలు..ఆ సుందరదృశ్యాన్ని చూసేందుకు ఖచ్చితంగా రెండు కండ్లు చాలవు. అందమైన సముద్రతీరం వైపు కొట్టుకువస్తున్న అలల సవ్వడి ఓ వైపు ..సన్నీలియోన్ పరువాల సందడి మరోవైపు..ఈ రెండు అందమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తే ఎలా ఉంటుంది. ఆ విజువల్స్నే సన్నీలియోన్ నెట్టింట షేర్ చేసుకుంది.
సన్నీ రోజ్ కలర్ స్విమ్ బికినీ వేర్లో మాల్దీవుల్లో షికారు చేసింది. స్టైలిష్ట్ గాగుల్స్ పెట్టుకుని తీరంలోని ఇసుకతిన్నెలపై హొయలు పోతూ సముద్ర అలల తాకిడిని ఆస్వాదిస్తున్న విజువల్స్ ను కెమెరాలో క్లిక్ మనిపించగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. మరోవైపు మలయాళం, తమిళం, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Taapsee vs Reporter | ‘నా ప్రశ్నకు జవాబిస్తే..మీకు సమాధానమిస్తా..’రిపోర్టర్ వర్సెస్ తాప్సీ..వీడియో వైరల్