మంచు విష్ణు టైటిల్లో రోల్ చేస్తున్న చిత్రం జిన్నా (Ginna). బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, ఆర్ఎక్స్ ఫేం పాయల్ రాజ్‌పుత్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘గోలీ సోడా’ సాంగ్‌ను రివీల్ చేశారు. ఓ ‘ గోలీ సోడావే..గుండెకాయ మత్తెక్కే పానూ బీడావే..మైండ్ కాస్త పిచ్చెక్కే..అందాలే మెక్కేశావే..అంటూ మాస్ బీట్తో సాగుతున్న ఈ పాటను నకాస్ అజీజ్, నూతన మోహన్ పాడారు. బాలాజీ రాసిన ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు.
గ్రామీణ కథాంశం నేపథ్యంలో సాగే ఫన్ ఎంటర్టైనర్కు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దీంతోపాటు కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ-ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. అక్టోబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో విష్ణు టెంట్ హౌస్ ఓనర్ జిన్నా పాత్రలో కనిపించనున్నాడు .ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశాడు.