ఓ వైపు తెలుగు, మరోవైపు హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ముంబై భామ తమన్నా భాటియా (Tamannah bhatia). ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోళా శంకర్, భోలే చుడియాన్తోపాటు ఈ బ్యూటీ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer) ఈ జాబితాలో ఉన్నాయి. బబ్లీ బౌన్సర్ తొలి మహిళా బౌన్సర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం మాధుర్ భండార్కర్ అండ్ తమన్నా టీం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ప్రమోషన్స్ లో ఏ యాక్టర్‌తో మళ్లీ కలిసి నటించాలని ఉందని రిపోర్టర్లు తమన్నాను అడిగారు. దీనిపై తమన్నా స్పందిస్తూ..తనకు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది తమన్నా. సైఫ్ అలీఖాన్, తమన్నా 2014లో వచ్చిన Humshakalsలో నటించారు. బబ్లీ బౌన్సర్ సెప్టెంబర్ 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
సత్యదేవ్‌తో కలిసి నటిస్తోన్న గుర్తుందా సీతాకాలం షూటింగ్ పూర్తి చేసుకుంది. మేఘా ఆకాశ్, సుహాసిని మణిరత్నం, కావ్యాశెట్టి కీ రోల్స్ నటిస్తున్న ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటివరకున్న అప్డేట్ కాగా..దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.