కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలతో విజయాలు అందుకున్నారు. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. దానికి ముందు బృందావనం, మున్నా, భద్ర లాంటి సినిమాలకు రచయితగా పని చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలతో విజయాలు అందుకున్నారు. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. దానికి ముందు బృందావనం, మున్నా, భద్ర లాంటి సినిమాలకు రచయితగా పని చేశారు. సింహా సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించారు. దాంతో పాటు మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించాడు కొరటాల. కానీ ఆయన పేరు పడలేదు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మూడేళ్లుగా సాగుతూనే ఉంది. మధ్యలో అనుకోని బ్రేకులు వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ ఆగిపోయింది.
జూన్ 15న కొరటాల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంత సక్సెస్ ఫుల్ కెరియర్ ఉన్న కొరటాల శివ.. తన రిటైర్మెంట్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీ కి వచ్చాడు. వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఒక ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన నిజం ఇది. దర్శకుడిగా మారినప్పుడే కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడు ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీ లోనే ఉంటాడు.. కానీ దర్శకుడిగా మాత్రం కాదు.
నిర్మాతగా మారి చిన్న సినిమాలు చేయాలని ఉందంటూ గతంలో ఒకసారి చెప్పాడు కొరటాల శివ. దర్శకుడిగా మాత్రం 10 సినిమాలు తీసి రిటైర్ అవుతానని ఒకానొక సమయంలో ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో తాను 10 కథలు రాసి పెట్టుకున్నానని.. వాటిని పూర్తి చేసి నిర్మాతగా మారిపోతాను అంటున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్న దర్శకుడు సినిమాలు చేయకుండా ఉండటమనేది ఒక రకంగా నేరమే. దానికి మన హీరోలు, నిర్మాతలు అసలు ఒప్పుకుంటారా అనేది అతి పెద్ద అనుమానం. ఈయన తర్వాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఈ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా ఇది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

