మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 18:48:53

ఆదాశ‌ర్మ స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే..ఫొటోలు వైర‌ల్

ఆదాశ‌ర్మ స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే..ఫొటోలు వైర‌ల్

ఆదాశ‌ర్మ‌..చేతిలో సినిమాలున్నా లేక‌పోయినా అభిమానుల‌కు మాత్రం ట‌చ్ లో ఉంటుంది. సోష‌ల్ మీడియాలో త‌న సినిమాల అప్ డేట్స్ తోపాటు ఇత‌ర యాక్టివిటీస్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ లో షేర్ చేస్తుంటుంది. త‌న డ్యాన్సింగ్ స్కిల్స్ తో కొరియోగ్రాఫ‌ర్లే ముక్కున వేలేసుకునేలా చేస్తుంటుంది. లాక్ డౌన్ కాలంలో ఆదా శ‌ర్మ చేసిన డ్యాన్స్ వీడియోలు చాలా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఎప్పుటిక‌పుడు కొత్త లుక్స్ లో క‌నిపించే ఈ బ్యూటీ తాజాగా ఎయిర్ పోర్టు తళుక్కున మెరిసింది.

ఈ సారి చూపరులంద‌రూ తన‌వైపే చూసేలా స‌రికొత్త లుక్ లో క‌నిపించింది. థిక్ బ్లూ క‌ల‌ర్డ్ ష‌ర్టు, చ‌మ్‌కీల్లాగా మెరుస్తున్న డిజైన్ తో ఆదా శ‌ర్మ వేసుకున్న సింగిల్ డ్రెస్ కాస్టూమ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆదాశ‌ర్మ ఓ చేతిలో ఫేస్ షీల్డ్, మ‌రో చేతిలో ఫోన్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఎయిర్ పోర్టు నుండి బ‌య‌ట‌కొస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo