గూగుల్లో 16.50 కోట్ల సార్లు శోధించారు
వాషింగ్టన్, ఏప్రిల్ 28: ‘భార్యను అదుపులో పెట్టడం ఎలా?’- ఈ ప్రశ్నకు సమాధానం కోసం గతేడాది గూగుల్లో 16.50 కోట్ల సార్లు శోధించారట! గతేడాది సుదీర్ఘ లాక్డౌన్లతో ప్రజలు ఇండ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇండల్లో బందీలుగా మారడంతో చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, గృహహింస పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి గూగుల్లో ఏం శోధించారో తెలుసుకునేందుకు ఓ సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఎవరికీ తెలియకుండా భార్యను కొట్టడమెలాగో కూడా గూగుల్లో 16.50 కోట్ల సార్లు వెతికారట.