దేశంలో 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్ విజృంభణతో పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. ఇందులో 1,50,86,878 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
మరో 30,84,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 3,645 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా మరణాలు 2,04,8320కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది.
మహారాష్ట్రలో నిన్న 63,309 కరోనా కేసులు నమోదవగా 985 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 29,824, ఢిల్లీలో 25,986 మంది కరనాబారినపడ్డారు. కర్ణాటకలో 39,047, కేరళలో 35,103 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇలా దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు రికార్డయ్యాయి.
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 17,68,190 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 28 వరకు 28,44,71,979 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యాక్టివ్ కేసులు ఉన్న జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరింది. అత్యధికంగా అమెరికాలో 60 లక్షల 80 వేల మందికిపైగా బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. ఇక రెండో స్థానంలో భారత్‌లో 30 లక్షలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉండగా, బ్రెజిల్లో 10 లక్షకుపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫ్రాన్స్‌లో యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరువలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
యూఎస్ నుంచి భారత్‌కు.. వంద మిలియన్ డాలర్ల వైద్య సామగ్రి
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఏప్రిల్ 28న విడుదలై హిస్టరీ రిపీట్ చేసిన ఇండస్ట్రీ హిట్స్
టీకా ఒక మోతాదు కూడా చాలా ఉపయోగకరమే.. బ్రిటన్ అధ్యయనం
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
Varanasi | వారణాసి ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ రూ.500 కోట్లా?
Revanth Reddy | మిమ్మల్ని రిగ్గింగ్ చేయమనట్లే.. నూతన డీఎస్పీల మాటామంతిలో రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
KTR Rythu Garjana | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు నిర్మల్‌లో కేటీఆర్ రైతుగర్జన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

