టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు | మే ఒకటో తేదీన మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభం కానుంది.

న్యూఢిల్లీ : మే ఒకటో తేదీన మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయనుండగా.. బుధవారం సాయంత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. భారీ స్పందన వచ్చింది. మొదటి మూడు గంటల్లో నిమిషానికి 2.7 మిలియన్ల హిట్స్ రాగా.. 1.45 కోట్ల టెక్ట్స్ మెస్సేజ్‌లు విజయవంతంగా పంపినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకేసారి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించడంతో కొవిన్ పోర్టల్ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఓటీపీలు రాలేదు. అయితే, అధికారులు సమస్య పరిష్కరించడంతో కొద్ది సేపటి తర్వాత పోర్టల్ అందుబాటులోకి రాగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది.
టీకా షెడ్యూల్ సాధ్యం కాకపోయినప్పటికీ.. రిజిస్ట్రేషన్లు పెరగడం స్వాగతించే అంశమని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు ప్రైవేటు దవాఖానల్లో 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత కేవలం ప్రభుత్వ హాస్పిటళ్లలో మాత్రమే ఇస్తారని అధికారులు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఇటీవల ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం టీకా తయారీ సంస్థల నుంచి 50 శాతం నేరుగా సేకరించుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వేయడం ద్వారా ప్రభుత్వ సౌకర్యాలపై భారం తగ్గుతుందని పేర్కొంది.
ఇప్పటి వరకు మొత్తం 14.71 కోట్ల రిజిస్ట్రేషన్లలో 9.33 కోట్ల మంది నేరుగా కేంద్రాలకు రాగా.. 2.82 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యాయి. సుమారు 2.55 కోట్ల మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేశాయి. మూడో దశలో ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకాలు వేసేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అర్హత ఉన్న వారంతా కోవిన్ పోర్టల్ (cowin.gov.in)లో, లేదంటే ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులలోని టీకా కేంద్రాల వద్ద వ్యాక్సిన్లు అందుబాటు ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని కేంద్రం పేర్కొంది.
స్లాట్లు అందుబాటులో లేక చాలా మంది నిరాశకు గురవుతున్నారని, త్వరలో మరిన్ని స్లాట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. స్లాట్లు అందుబాటులో లేకపోతే మరోసారి తిరిగి ప్రయత్నించాలని, పరిస్థితిని అర్థం చేసుకుని సహనంతో ఉండాలని సూచించారు. వారం పది రోజుల్లో పరిస్థితులు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగానే సాగుతోందని, సర్వర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం సెకనుకు 55వేల హిట్స్‌ను రికార్డు చేస్తోందని, పూర్తిగా స్థిరంగా ఉందని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు తెలంగాణలో వానలు
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
నేటినుంచి పాస్‌పోర్ట్ సేవలకు బ్రేక్
కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

