వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం | రెండు రోజులుగా వరుస భూకంపాలతో ఈశాన్య రాష్ట్ర అసోం చిరుగుటాకులా వణికిపోతోంది.

దిస్పూర్ : రెండు రోజులుగా వరుస భూకంపాలతో ఈశాన్య రాష్ట్ర అసోం చిరుగుటాకులా వణికిపోతోంది. బుధవారం రాత్రి వరకు సుమారు 13 సార్లు భూమి కంపించింది. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌పూర్‌లో ఆరుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. మొదట అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మళ్లీ 1.10 గంటలకు, ఆ తర్వాత 1.20 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 మాగ్నిట్యూడ్‌తో భూమి కంపించి. 1.41 గంటలకు మరోసారి 2.3, అనంతరం 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి. చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. మరోసారి వరుసగా భూకంపాలు రావడంతో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు రోజులుగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

బుధవారం ఉదయం సంభవించిన భూకంపాలకు పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్‌తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. సోనిత్పూర్ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదవగా.. పశ్చిమ బెంగాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.
ఆ తర్వాత మరోసారి 12 సార్లు స్వల్ప తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సర్బానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం తరఫున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు తెలంగాణలో వానలు
నేటినుంచి పాస్‌పోర్ట్ సేవలకు బ్రేక్
కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

