e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News 30 మంది ప్రాణాలు కాపాడిన ఆపద్భాందవుడు సోనూ సూద్

30 మంది ప్రాణాలు కాపాడిన ఆపద్భాందవుడు సోనూ సూద్

30 మంది ప్రాణాలు కాపాడిన ఆపద్భాందవుడు సోనూ సూద్

ఈ రోజుల్లో ఉన్నదాంట్లో సాయం చేయడానికే ఎవరికీ మనసు రాదు. కానీ సోనూ సూద్‌ మాత్రం ఏకంగా తన ఆస్తులు అమ్ముకుని మరీ సాయం చేస్తున్నాడు. దేవుడు అలాంటి మంచి మనసు కొంత మందికి మాత్రమే ఇస్తుంటాడు. ఇప్పుడు దైవం మానుష్య రూపేనా అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు సోనూ సూద్. గ‌తేడాది వరకు ఈయన అందరిలాంటి నటుడు. విలన్ వేషాలు వేసుకునే యాక్టర్. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈయనలోని మంచి మ‌న‌సు ఎలా ఉంటుందో తెలిసిపోయింది అందరికీ. అప్పట్నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సాయం చేశాడు. ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు.

ఈ మధ్యన కరోనా వచ్చిన సమయంలో కూడా తన ఆరోగ్యం చూసుకుంటూ ఇతరులకు సాయం చేశాడు సోనూ సూద్. ఈ మధ్య ఒక కరోనా రోగి కోసం ప్రత్యేకంగా ఎయిర్ ఆంబులెన్స్ అరేంజ్ చేశాడు సోను. అయితే కొన్ని రోజుల తర్వాత పాపం ఆమె చనిపోయింది. మొన్నటికి మొన్న బెంగళూరులోని ఓ ఆస్పత్రికి సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఏకంగా 22 మంది ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సాయమే చేశాడు సోనూ సూద్. ఈయన కారణంగా దాదాపు 30 మంది కొవిడ్ -19 రోగుల ప్రాణాలు నిలిచాయి. బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో ఆక్సిజన్ లీక్ అయింది. ఆ లీక్ గురించి తెలుసుకున్న‌ సోనూ సూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది.

ఆ సమయానికి అక్కడున్న కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా గంట మాత్రమే మిగిలి ఉంది. ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ సమిత్ హవినల్ వెంటనే అక్కడున్న సంక్షోభం నుంచి బయటపడటానికి సోనూ సూద్ ఫౌండేషన్, మేఘా చౌదరి అలాగే పోలీసు హెల్ప్‌లైన్ బృందాలను అలెర్ట్ చేశాడు. పోలీసులు అక్కడికి వచ్చేలోపే సోనూ సూద్ బృందం అక్కడ పని మొదలు పెట్టారు. సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రులతో పాటు మరికొన్ని చోట్ల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను సంప్రదించి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను సంపాదించారు. వాటిని స‌కాలంలో అందించడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. దీంతో సోనూ సూద్ ను అంతా ప్రశంసలతో ముంచెత్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మళ్లీ ఆగిన‌ సీరియల్ షూటింగ్స్‌

జాతిరత్నం హీరోయిన్ గ్లామ‌ర్ పిక్స్‌.. వైర‌ల్‌

రాధేతో నిరాశ‌ప‌ర‌చిన ప్ర‌భుదేవా..డైరెక్ష‌న్‌కు బైబై చెప్పాలంటూ సూచ‌న‌!

కుర్ర దర్శకుల కలలను చిదిమేస్తున్న కరోనా

విష్ణు ప్రియ గ్లామ‌ర్ షో.. యువత ఫిదా

పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్ర‌మ్..!

రాధే చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ర‌చ్చ‌

24 గంటలు కలిసే ఉంటాం

అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!

నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ

‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద క‌థే ఉంది..!

త‌మిళియ‌న్‌ను పెండ్లి చేసుకుంటా: ర‌ష్మిక‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
30 మంది ప్రాణాలు కాపాడిన ఆపద్భాందవుడు సోనూ సూద్

ట్రెండింగ్‌

Advertisement