కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా టీవీ సీరియల్స్ కూడా ఈ కరోనా ధాటికి నష్టపోతున్నాయి. గతేడాది లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగానే సీరియల్స్, టీవీ షోలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కూడా పది రోజుల లాక్డౌన్ విధించడంతో మరోసారి అదే ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిపివేశారు. ఇప్పుడు టీవీ రంగం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. సీరియల్ నటీనటులు, నిర్మాతలకు సీరియల్ షూటింగ్స్ ఆపేయాలని సూచించింది. ఈ నిర్ణయానికి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్( ఏఏటీటీ ) కూడా మద్దతు తెలిపింది.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఎప్పుడైతే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిందో అప్పటి నుంచి షూటింగ్స్ జరగడం లేదు. రామోజీ ఫిలిం సిటీలోనూ షూటింగ్స్‌ను ఆపారు. అయితే కొందరు షూటింగ్స్ చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అలా షూటింగ్స్ చేయడానికి చానల్స్ నుంచి నిర్మాతలకు ఉండే ఒత్తిడే కారణం కావచ్చు. ఆ ఒత్తిడితో నిర్మాతలు షూటింగ్స్‌ను ఆపాలంటే ఆలోచిస్తున్నారు. కొంతమంది సీరియల్ నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్స్‌ను కొనసాగించేందుకు అనుమతి అడగాలని అనుకుంటున్నారు.” అని తెలిపారు.
ఇక టెక్నీషియన్ల కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ.. ” ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కొంతమంది కరోనా బారిన పడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్స్‌లో జాయిన్ అయ్యారు. అయితే కొంతమంది టెక్నిషియన్లు మాత్రం తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. తమకు కరోనా వచ్చిందని తెలిస్తే పని దొరకదని, తిండి ఉండదని బాధపడే కార్మికులే ఇలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల బాధ్యతను చానళ్ల వాళ్లు తీసుకుంటే బావుంటుంది ” అని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
కుర్ర దర్శకుల కలలను చిదిమేస్తున్న కరోనా
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్రమ్..!
రాధే చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
నాగార్జునతో పదోసారి జోడీ కడుతున్న అనుష్క
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
తమిళియన్‌ను పెండ్లి చేసుకుంటా: రష్మిక