రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!

నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రభుదేవా. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈయన డైరెక్టర్ గా బిజీ అయ్యాడు. అయితే తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత చేసిన పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో తమిళంలో పోకిరి సినిమాను రీమేక్ చేశాడు ప్రభుదేవా. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత అదే సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ పేరుతో రీమేక్ చేసాడు. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.
దాంతో బాలీవుడ్ హీరోలకు బాగా కనెక్ట్ అయిపోయాడు ప్రభుదేవా. విక్రమార్కుడు రీమేక్ రౌడీ రాథోడ్, రాంబో రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, దబాంగ్ 3 లాంటి సినిమాలు అక్కడ తెరకెక్కించాడు. అందులో రౌడీ రాథోడ్ మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మూడు సినిమాలు డిజాస్టర్. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ మరోసారి ఆయన చేసిన సినిమా రాధే రంజాన్ సందర్భంగా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలైంది. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రభుదేవా దర్శకుడిగా ఏ మాత్రం సూట్ అవ్వడు హాయిగా వెళ్లి నటుడిగా.. డాన్స్ మాస్టర్ గా చేసుకుంటే బెటర్ అంటూ సల్మాన్ వీరాభిమానులు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
సినిమాలో అసలు విషయం లేకుండా చేయడం కంటే ఖాళీగా రెస్ట్ తీసుకోవడం నయం అంటూ ఫాన్స్ మండి పడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుదేవాకు అవకాశాలు ఇచ్చింది చాలు.. ఇకపై వద్దు అంటూ తమ హీరోలకు అభిమానులు అర్జీ పెట్టుకుంటున్నారు. ఏదేమైనా రాధే సినిమా ఫలితం చూసిన తర్వాత ప్రభుదేవాను దర్శకుడిగా మరిచిపోతారేమో..!
ఇవి కూడా చదవండి..
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్‌పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
దంతాలు బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- prabhudeva
- Radhe
- salman khan
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

