DC vs GT | గుజరాత్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. 9.4వ ఓవర్లో వృద్ధిమాన్ సాహా (39) కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి ఔటవ్వగా.. 11వ ఓవర్ తొలి బంతికి అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా ఔటయయాడు.
భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా(39)తో కలిసి సాయి సుదర్శన్(50) దూకుడుగా ఆడాడు. అయితే 10వ ఓవర్లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (1) వెంటనే ఔటయ్యాడు