Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
Woman Hires Friends To Kill Boyfriend | ప్రియుడ్ని వదిలించుకునేందుకు స్నేహితుల సహాయంతో అతడ్ని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ యువతితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: ప్రియుడ్ని వదిలించుకునేందుకు స్నేహితుల సహాయంతో అతడ్ని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ యువతితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Woman Hires Friends To Kill Boyfriend) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పట్టాంబికి చెందిన 19 ఏళ్ల సఫానాకు అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడితో రిలేషన్షిప్ ఏర్పడింది. అయితే ప్రియుడ్ని వదిలించుకోవాలని ఆమె భావించింది. దీంతో అతడ్ని కిడ్నాప్ చేసి దోచుకుని హత్య చేసేందుకు తన స్నేహితులను నియమించింది.
కాగా, నవంబర్ 10న రాత్రి వేళ సఫానా స్నేహితులు ఆ యువకుడిని తిరూర్‌కు రప్పించారు. ఒక వ్యక్తి బైక్‌పై అతడ్ని ఎక్కించుకున్నాడు. మిగతా వారు ఉన్న ప్రాంతానికి అతడ్ని తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ యువకుడిని బలవంతంగా ఒక కారులోకి ఎక్కించి దాడి చేశారు. అతడి మొబైల్ ఫోన్ దోచుకున్నారు. ఆ యువకుడిని తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. గాయపడిన అతడ్ని తాళెపాలెం నదీ తీరం సమీపంలో రోడ్డు పక్కన పడేసి పారిపోయారు.
మరోవైపు ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని కాపాడారు. బుధవారం తెల్లవారుజామున తాళెపాలెం సమీపంలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సఫానాతో పాటు తిరూర్‌కు చెందిన ఆమె స్నేహితులైన 20 ఏళ్ల నాదియా, 25 ఏళ్ల రబీనాతో పాటు 28 ఏళ్ల ఇర్షాద్, 25 ఏళ్ల అజారుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ప్రియుడిని కిడ్నాప్ చేసి హత్య చేయించేందుకు సఫానా నియమించిన ఇర్షాద్, అజారుద్దీన్‌కు నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్యాయత్నం, హింసాత్మక దాడులతో సహా పలు క్రిమినల్ కేసులు వారిపై నమోదు కావడంతో పాటు వీరిద్దరూ గతంలో జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. ఐదుగురు నిందితులను తిరూర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
NRI | దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి : మహేష్ బిగాల
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

