Jersey movie in OTT | థియేటర్స్ ఉండగా డిజిటల్ మీడియాలో నేరుగా సినిమా విడుదల చేయడానికి కొంత మంది హీరోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన హీరోల పరిస్థితి ఏమో తెలియదు గానీ తమ వరకు మాత్రం తమ సినిమాలు కచ్చితంగా థియేటర్స్‌లోనే విడుదల కావాలని వాళ్లు గట్టిగా నిర్ణయించుకుంటున్నారు. అందుకే పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినా కూడా తమ సినిమాలను ఓటీటీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు కొందరు హీరోలు. అందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఉన్నాడు. గతేడాది అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో ఫాంలోకి వచ్చాడు షాహిద్.
కబీర్ సింగ్ ముందు షాహిద్ కపూర్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలో వచ్చిన ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో మరోసారి తెలుగు సినిమానే నమ్ముకున్నాడు షాహిద్ కపూర్. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సహా మరో ఐదు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు విధించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
దాంతో ఈయన హీరోగా నటించిన జెర్సీ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో షాహిద్ కపూర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కావాలంటే రెమ్యునరేషన్లో 10 కోట్లు వెనక్కి ఇస్తాను కానీ తన సినిమాను నేరుగా థియేటర్స్‌లో విడుదల చేయాలని ఆయన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి నిర్మించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అందరూ మర్చిపోయిన వరుణ్ సందేశ్‌ను ఆ సినిమా గుర్తు చేస్తుందా..?
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..
Arjuna Phalguna | అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!
Vishwak sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్..