Nani returned Shyam singharoy remuneration | నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి కెమిస్ట్రీకి అద్భుతమైన మార్కులు పడ్డాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రాలేదు. మొదటి వారం కేవలం రూ.22 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు ఊహించిన రెస్పాన్స్ రాలేదు. దాంతో నాని బాగా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.
తన తర్వాత సినిమా ఎలా అయినా కూడా ఖచ్చితంగా థియేటర్లలో విడుదల కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలో భారీగానే విడుదలైంది. నిర్మాత వెంకట్ బోయినపల్లికి ఇది తొలి సినిమా అయినా కూడా నాని అంతా వెనుక ఉండి నడిపించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నిర్మాత దిల్ రాజు కూడా శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఈయన నైజాం డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఇక్కడ ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా.
కానీ కీలకమైన ఏపీలో మాత్రం శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ రావడం లేదు. అక్కడ టికెట్ రేట్స్ తో పాటు ఇంకా చాలా సమస్యలు నాని సినిమాను వెంటాడాయి. దానికి తోడు విడుదలకు ముందు ఈయన చేసిన కామెంట్స్ కూడా అక్కడ సినిమా కలెక్షన్స్‌పై దారుణంగా ప్రభావం చూపించింది. అందుకే తను సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్లో దాదాపు 65 శాతం నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ కోసం దాదాపు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ నాని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో రూ.5 కోట్లు ఆయన రిటర్న్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తన సినిమా కోసం నాని చేసిన సాహసంలో ఇది కూడా ఒకటి అయిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
బుర్ఖాలో థియేటర్‌కి వచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్