పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్

Pawan kalyan in shyam singharoy2 | టాక్సీవాలా సినిమాతో సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. తాజాగా శ్యామ్ సింగరాయ్ అనే పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. 1970లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. శ్యామ్ సింగరాయ్ 2 కూడా తీయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
శ్యామ్ సింగరాయ్ సినిమాకు తాను ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం తనకు చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ సందర్భంగానే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. అతనితో సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలో ఒక ఫైర్ ఉంటుంది. పవర్ స్టార్‌కు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ ఒప్పకోవాలే గానీ ఆయనతో శ్యామ్ సింగరాయ్ 2 సినిమా చేస్తా. అలాంటి పవర్ఫుల్ పాత్రల్లో ఆయన్ను చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి హీరోతో పవర్ఫుల్ కథను తెరకెక్కిస్తే థియేటర్లు పగిలిపోతాయి. అని రాహుల్ సాంకృత్యన్ చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shyam Singha Roy సినిమా రివ్యూ
Shyam Singha Roy Making video | క్యూరియాసిటీ పెంచుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ మేకింగ్ వీడియో
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సీక్వెల్లో పవన్ కళ్యాణ్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

